తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

భక్తులకు ఇబ్బందులు రాకుండా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చేయాలి 

భక్తులకు ఇబ్బందులు రాకుండా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చేయాలి 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : వైకుంఠ ఏకాదశి మహెూత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన పనులను నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా మన్నలను పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షణ భద్రాచలం ఆర్డీవో, బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ శాఖ చేపట్టాలని తెలిపారు. లాడ్జి, హెూటల్ యజమానలనులతో సమావేశం నిర్వహించి ధరల నిర్ణయించాలని డిఎస్ఓ కు సూచించారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. భద్రాచలం, దుమ్ముగూడెం దేవాలయాలతో పాటు భద్రాచలం వంతెన, కరకట్టను విద్యుత్ దీపాలతో అలంకరించాలని తెలిపారు. భక్తులు మహెూత్సవాలు వీక్షణకు ఎస్ఈడి స్కిన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. హంస వాసనం తనికి చేసి ద్రువీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఈ ని ఆదేశించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలని తెలిపారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆహార పదార్థాలు నాణ్యతను తనిఖీ చేసి నివేదిక అంది చేయాలని ఆహార తనకి, పౌర సరఫరాల శాఖల అధికారులను ఆదేశించారు. పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణకు భద్రాచలం పట్టణాన్ని, పర్ణశాలను జోన్లు గాను విభజించి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని తెలిపారు. ప్రతి సెక్టార్కు ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు పట్టణంలోని ప్రధాన కూడళ్లులో మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. భక్తులకు బస్సులు, రైల్వే సమయాలను, అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయు విధంగా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్ ను ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తులు వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుగా పార్కింగ్ స్థలాలకు గుర్తించేందుకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. సబ్ కలెక్టర్, ఏఎస్పీ కార్యాలయాలల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర వైద్యచికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్య సేవలకు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వార్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. బాణాసంచాలు కాల్చుటలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మహోత్సవ రోజుల్లో 22, 23 తేదీల్లో మద్యం, మాంసాహారాలు విక్రయాలను నిలిపివేయాలని, సమీప జిల్లాలు, రాష్ట్రాల నుండి మద్యం రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆబ్కారి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డిఆర్ రవీంద్రనాథ్, దేవస్థానం ఈఓ రమాదేవి, డిపిఓ రమాకాంత్, డిసిఓ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈఈలు భీంలా, వెంకటేశ్వరావు, వైద్యాధికారి డా. శీరిష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *