ఖమ్మంతెలంగాణ

భట్టి గెలుపుకు సహకరించాలి

భట్టి గెలుపుకు సహకరించాలి

మధిర , శోధన న్యూస్ : మధిర అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానిక శాసనసభ్యులు సిఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని మల్లు నందిని కోరారు. మంగళ వారం మధిర పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త మణిదీప్ షెట్టర్స్ అధినేత దూళిపాటి వీరయ్య చౌదరిని మధిర లోని ఆయన నివాసంలో మల్లు నందిని కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ 2009లో తొలిసారిగా పోటీ చేసినప్పుడు ధూళిపాటి వీరయ్య చౌదరి కష్టపడి పని చేసి భట్టి విక్రమార్క గెలుపులో కీలకపాత్ర పోషించారని ఆమె గుర్తు చేశారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి పోటీ చేస్తున్న మల్లు బట్టి విక్రమార్కకు మద్దతు పలికి గెలిపించాలని ఆమె కోరారు. ధూళిపాటి వీరయ్య చౌదరి మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ నుండి పోటీ చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా భట్టి విక్రమార్క సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లు భట్టి విక్రమార్క కీలక స్థానంలో ఉంటారని దీంతో మధిర నియోజకవర్గ రూపురేఖలు మారబోతాయని ఆయన అన్నారు. డిప్యూటీ స్పీకర్గా, చీప్ విప్ గా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క మధిర కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారన్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీవీ రెడ్డి, కౌన్సిలర్ కోన ధని కుమార్, పారుపల్లి విజయ్ తలుపుల వెంకటేశ్వర్లు, తూమాటి నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *