భట్టి విక్రమార్కను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుల ప్రచారం
భట్టి విక్రమార్కను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుల ప్రచారం
ఎర్రుపాలెం, శోధన న్యూస్ : ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఎర్రుపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టి విక్రమార్క గెలుపు కాంక్షిస్తూ మండల కమిటీ కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు గురించి ఇంటింటికి వివరించి , బట్టి విక్రమార్క ను గెలిపిస్తే మ ది ర నియోజక వర్గం మరింతగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. భట్టి విక్రమార్క కు ప్రజల జై కొడుతున్నారని హస్తం గుర్తుకి ఓటు వేసి అత్యధిక ఓట్లు మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఐలూరు వెంకటేశ్వర రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పిసిసి సభ్యులు శీలం ప్రతాపరెడ్డి , బండారు నరసింహారావు, సోరంశెట్టి భాస్కరరావు. శీలం శ్రీనివాసరెడ్డి, అ ను మో లు వెంకట కృష్ణారావు, మీడియా ఇన్చార్జి మల్లెల లక్ష్మణరావు, షేక్ ఇస్మాయిల్, కడియం శ్రీనివాసరావు, బుర్ర వెంకటనారాయణ, సూరం శెట్టి రాజేష్, బాజీ , శ్రీపాలిశెట్టి శ్రీనివాసరావు , షేక్ ఖాదర్ బాషా, మహిళలు పాల్గొన్నారు .