భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి రోహిత్ రాజు బాధ్యతలు చేపట్టారు.శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజు ఎస్పీ డాక్టర్ వినీత్ జీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు నూతన ఎస్పీ రోహిత్ రాజు ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. 2018 బ్యాచ్ కి చెందిన ఐ
పీఎస్ అధికారి రోహిత్ రాజు ప్రస్తుతం హైద్రాబాద్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా విధులు నిర్వర్తిస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బదిలీ అయ్యారు. గతంలో భద్రాచలం ఏఎస్పీగా పని చేస్తూ పదోన్నతిపై గ్రేహౌండ్స్ ఏస్పీగా బదిలీ అయ్యారు. 2023 నవంబర్ నెలలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.