భాజపా అభ్యర్థి రామలింగేశ్వర రావును గెలిపించండి-జనసేన అధినేత పవన్ కళ్యాణ్
భాజపా అభ్యర్థి రామలింగేశ్వర రావును గెలిపించండి
-జనసేన అధినేత పవన్ కళ్యాణ్
సత్తుపల్లి, శోధన న్యూస్ : జనసేన బలపరిచిన సత్తుపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నంబూరు రామలింగేశ్వర రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, బీజేపి కె తన సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రకాశం స్టేడియంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత జనసేన అభిమానులు కార్యకర్తలతో పాటు బీసీలపై ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. ఇప్పటివరకు బీసీలను ఓటు బ్యాంకు గానే పలు పార్టీలు ఉపయోగించుకున్నాయని, భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిని బీసీలనే చేస్తామని ప్రకటించిన విషయం ప్రజలు గమనించి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. జనసేన బలపరిచిన సత్తుపల్లి నియోజకవర్గం భాజపా అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.