భారత ఒలింపిక్ సీఈఓగా రఘురామ్ అయ్యర్
భారత ఒలింపిక్ సీఈఓగా రఘురామ్ అయ్యర్
హైదరాబాద్, శోధన న్యూస్:
భారత ఒలింపిక్ అసోసియేషన్ ఐఏసీ కొత్త సీఈఓ గా రఘురామ్ అయ్యర్ శుక్రవారం సాయంత్రం ఎంపికయ్యారు. ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. గతంలో రఘురామ్ అయ్యర్ రాజస్థాన్ రాయల్స్ సీఈఓ గా పని చేశారు.రాజస్థాన్ రాయల్స్
సీఈఓగా పని చేసిన రఘురాం గతంలో అనేక కీలక బాధ్యతలను సైతం నిర్వహించారు. క్రీడా నిర్వహణలో రఘురామ్ కు ఉన్న అపార అనుభవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని అసోసియేషన్ వెల్లడించింది.పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘురాంను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఆయన ఎంపిక ఏకగ్రీవమని కూడా తెలిపింది. సీఈఓ నియామకంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలుమార్లు గుర్తు చేసిన నేపథ్యంలో రఘురామ్ నియామకం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ కు సీఈఓగా పని చేసిన రఘురాం గతంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు.