మండలస్థాయి యంత్రాంగం పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
మండలస్థాయి యంత్రాంగం పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలి
-లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం , శోధన న్యూస్: మండలస్థాయి యంత్రాంగం పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల బుధవారం సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మిచౌoగ్ తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.భారీ వర్ష సూచన దృష్ట్యా జిల్లా రెడ్ అలర్ట్ లో ఉందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిచామని తెలిపారు. పొంగి పొర్లుతున్న వాగులు, అలుగులు దాటే అవకాశం లేకుండా భారీ కేడింగ్ గా ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని సూచించారు. పొంగుతున్న వాగులు, చెరువు అలుగులు వీక్షించేందుకు ఎవ్వరిని అనుమతించొద్దని, నియంత్రణ చేయాలని తెలిపారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినందున హాస్టళ్లు, ఇండ్లలో ఉండే విద్యార్థులు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సరదాల కొరకు పొంగుతున్న వాగులు, అలుగులు దాటే ప్రయత్నం చేస్తుంటారని, దాని వల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపారు. సహాయానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 08744241950, కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం 08743232444 కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని తెలిపారు. పశువులను మేతకు బయటికి మేతకు వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని తెలిపారు. . పనులకు వెళ్లే కూలీలు వర్షాలు తగ్గే వరకు ఇంటి పట్టునే ఉండాలని తెలిపారు.