తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మంత్రి తుమ్మలను సన్మానించిన కమ్మ మహజన సంఘం నాయకులు

మంత్రి తుమ్మలను సన్మానించిన కమ్మ మహజన సంఘం నాయకులు

మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మణుగూరు మండల కమ్మ మహజన సంఘం నాయకులు ఆదివారం భద్రాచలం(సారపాక) విశ్రాంతి భవనంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 24న మణుగూరు వెన్నెల జలపాతం వద్ద జరిగే కమ్మ మహజన సంఘం వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ వారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించారు. అనంతరం మంత్రి తుమ్మలను వారు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమ్మ మహజన సంఘం మండల అధ్యక్షులు వీరపనేని చెన్నకేశవరావు, ఉపాధ్యక్షులు దొడ్డ తిరుపతిరావు, యాలమాటి పూర్ణచందర్రావు, పోశం భాస్కర్, మేదరమెట్ల యాదగిరి, దారపునేని హరి, దొబ్బల వెంకటప్పయ్య, నామా వెంకటేశ్వరరావు, దండా రాధాకృష్ణ, గుడిపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *