మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం
నేలకొండపల్లి, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా నేలకొండపల్లి మండలానికి విచ్చేసిన ఆయనకు పైనంపల్లి గ్రామం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొందయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్, మండల నాయకులు నెల్లూరు భద్రయ్య, నేలకొండపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, బచ్చలకూరి నాగరాజు, సత్యనారాయణ, రామచంద్రపురం సొసైటీ చైర్మన్ గూడవల్లి రామబ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.