ఖమ్మంతెలంగాణ

మంత్రులకు స్వాగతం పలికేందుకు నాయకన్ గూడెం వద్దకు చేరుకున్న  నేతలు

మంత్రులకు స్వాగతం పలికేందుకు నాయకన్ గూడెం వద్దకు చేరుకున్న  నేతలు

కొణిజర్ల, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నూతన మంత్రులుగా ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు కీలక నేతలకు పదవులు లభించి ప్రమాణ స్వీకారం అనంతరం ఖమ్మం జిల్లా విజయ ర్యాలీకి వస్తున్నటువంటి మంత్రులకు స్వాగతం పలికేందుకు ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం అయిన నాయక్ గూడెం వద్దకు కాంగ్రెస్ మండల కీలక నేతలు చేరుకున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవిన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ చేనేత టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా ఖమ్మం జిల్లాకి విజయోత్సవ ర్యాలీలో వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మా రోశయ్య పొట్లపల్లి శేషగిరిరావు తూము అప్పారావు షేక్ గాలి పాషా నల్లమోతు లక్ష్మయ్య, కొనకంచి మోష, కోసూరి చిన్న సైదారావు ,అడపా మధుసూదన్, చల్లా భాస్కర్, కోసూరి నాగ, సలీం, ఉస్మాన్ పొంగిలేటి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి, నాయకులు కొలిపాక వెంకటేశ్వర్లు చేరుకొని  మంత్రులకు  స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు అవకాశం రావడం ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈనాడు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు బహుత్తర పథకాన్ని అందించటం అభినందనీయమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *