తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మణుగూరులో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

 ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు  మండలంలోని ఆర్యవైశ్య కాలనీలో లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత లయన్స్ క్లబ్ సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గాజుల పూర్ణచందర్రావు మాట్లాడుతూ… తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ అమరణ నిరాహార దీక్ష పూని తన ప్రాణాలను పణంగా పెట్టి తెలుగు జాతీ సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేసిన మ వానీయుడు, తెలుగువాడి గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. పొట్టి శ్రీరాములు ఆనాడు చేసిన ఎనలేని కృషి ఫలితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలించేందుకు ఆయన సల్పిన కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి అడబాల నాగేశ్వరరావు, భాగం రమేష్, ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు నర్సింహా రావు, కాలనీ వాసులు పాల్గొన్నారు. I

-ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో :

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కో సం తెలుగువాళ్లందరినీ ఏకతాటిపైకి తెచ్చి తెలుగువాడి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న అమరుడు పొట్టి శ్రీరాములు అని కొ నియాడారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కత్తి రామచంద్ర రావు, పట్టణ అధ్యక్షులు కడవెండి విశ్వనాథ్ గుప్తా, నియోజకవర్గ ఇంచార్జ్ సిహెచ్ రమేష్ బాబు, కార్యదర్శి బండారు నరసింహారావు, కోశాధికారి శ్రీరామ్ రాము, సుగ్గల భాను, వాసవి క్లబ్ అధ్యక్షులు సిహెచ్ శేషుబాబు, జోన్ చైర్మన్ డి. బ్రహ్మయ్య, సముద్రాల కృష్ణమూర్తి, కే కృష్ణమూర్తి, కే ప్రసాద్, వనితా క్లబ్ అధ్యక్షురాలు సిహెచ్ నాగరత్నమణి. డిపిఓ కొత్త ఇందుమతి, కోశాధికారి బి మానస, స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *