మణుగూరు ఏరియా లో 82శాతం బొగ్గు ఉత్పత్తి
మణుగూరు ఏరియా లో 82శాతం బొగ్గు ఉత్పత్తి
-సింగరేణి ఏరియా జీఎం దుర్గం రామచందర్
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జనవరి మాసానికి నిర్దేశించిన లక్ష్యానికి గానూ…82శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం దుర్గం రామచందర్ తెలిపారు. బుధవారం ఏరియా జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్పత్తి, ఉత్పాదకతల వివరాలను వివరించారు. జనవరి నెలకు ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 11లక్షల 18వేల 100టన్నులకు గాను 9లక్షల 13వేల 577 టన్నులతో 82శాతం ఉత్పత్తిని సాధించామన్నారు. అలాగే ఓబి వెలికితీత లక్ష్యం 15 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 15.64లక్షల క్యూబిక్ మీటర్లతో 105 శాతం నమోదం చేయడం జరిగిందన్నారు. జనవరిలో మొత్తంగా 9లక్షల 14వేల 654 టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతల లక్ష్య సాధనకు ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, కార్మిక సంఘాల నాయకులు సమిష్టి గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏరియా ఏజీఎం సివిల్ వెంకటేశ్వర్లు, ఇంజనీర్ నర్సిరెడ్డి, ఏరియా రక్షన అధికారి వెంకటరమణ, డిజిఎం ఐఈడి వెంకట్రావు, డిజిఎం(పర్సనల్) ఎస్ రమేష్, డివైసిఎంఓ మేరికుమారి, డిజిఎం (ఫినాన్స్) అనురాధ. పర్యావరణ అధికారి శ్రీనివాస్, సీనియర్ పిఓ సింగు శ్రీనివాస్, సీనియర్ సెక్యూరిటి అధికారి షబ్బీరుద్దీన్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.