మణుగూరు లో 42కిలోల గంజాయి పట్టివేత
మణుగూరు లో 42కిలోల గంజాయి పట్టివేత
-ఇద్దరి పై కేసు నమోదు, కారు సీజ్
మణుగూరు, శోధన న్యూస్:
అక్రమంగా తరలిస్తున్న 42 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సై జ్ శాఖ సీఐ రామ్మూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని తోగ్గూడెం సమ్మక్క-సారక్క వద్ద ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, మణుగూరు ఎక్సై జ్ ఎస్సై సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీ లో అనుమానాస్పదంగా ఉన్న ఒక కారును ఆపి సోదా చేయగా కారులో 42 కిలోల గంజాయి లభించింది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకోవడం తో పాటు కారు ను సీజ్ చేసి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయిని ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారని ఎక్సైజ్ సిఐ తెలిపారు. వెంటనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఖరీం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.