మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య
మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య
మణుగూరు, శోధన న్యూస్: మండలంలోని సమితిసింగారం గ్రామపంచాయితీ వివేకనందనగర్ కు చెందిన అక్కినేపల్లి శ్రీనివాస్ (28) మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అక్కినేపల్లి శ్రీనివాస్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు, కుటుంబ ఎవరూ లేకపోవడం గత కొన్ని రోజుల నుండి మానసికంగా బాధపడుతూ ఒత్తిడి గురయ్యాడు. తనకు ఎవ్వరూ లేరని మనస్థాపం చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్దనాన్న కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.