మన్యం పోరులో మళ్ళీ గెలుపు నీదే బిడ్డ.. రేగా కు అమ్మ దీవెన
మన్యం పోరులో మళ్ళీ గెలుపు నీదే బిడ్డ.. రేగా కు అమ్మ దీవెన
మణుగూరు, శోధన న్యూస్: పినపాక మన్యం పోరులో మళ్ళీ నీదే గెలుపు నీదే అంటూ… రేగా కాంతారావు కు తన తల్లి ఆశీస్సులు అందించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్ పార్టీ పినపాక అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం మణుగూరు మండలం లో తహశీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తొలుత కరకగూడెం మండలంలోని సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీలో గల స్వగ్రామం కుర్నవల్లిలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి తో కలిసి తన తల్లి ఆశీర్వాదం పొందారు. ఇలవేల్పు లు, ఆ భగవంతుని ఆశీస్సులు, ప్రజల అధరణ ఎల్లవేళలా ఉంటాయని, ఎన్నికల్లో విజయం నీదే…అని దీవించారు. అనంతరం గ్రామంలోని ఆలయంలో, బొడ్రాయి వద్ద రేగా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఎన్నికల్లో గెలవాలని వేడుకున్నారు. అనంతరం పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.