మరోమారు ఆశిర్వదించండి…. భవిష్యత్ లో గుర్తుండేల అభివృద్ధి చేస్తా..- ప్రభుత్వ విప్ రేగా
మరోమారు ఆశిర్వదించండి…. భవిష్యత్ లో గుర్తుండేల అభివృద్ధి చేస్తా…
- దేశానికే మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
బూర్గంపాడు, శోధన న్యూస్: జరగబోయే ఎన్నికల్లో మరోమారు ఆశిర్వదించండి…. భవిష్యత్ లో గుర్తుండేల అభివృద్ధి చేస్తా… అని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశానికే మార్గదర్శగా నిలిచిందన్నారు. నిరంతర విద్యుత్, రైతుబంధు, సాగునీళ్ళతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీర్చబడిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ మరోసారి బలపరచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు… చేసేది లేద అని అనారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని, పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని గమనించాలన్నారు. విజ్ఞానులైన నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచింఛి అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న తనను జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మతాల, కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అందరి మనసులను హత్తుకునే విధంగా ఉందన్నారు. కెసిఆర్ బీమా ప్రతి కుటుంబానికి ధీమాగా అండగా నిలుస్తుందన్నారు. దివ్యాంగులకు పెన్షన్ పెంపు, రైతుబంధు, ఎకరాకి రూ 16,000, సన్న బియ్యం, అన్నపూర్ణ పథకం, మహిళలకు జీవన భృతి ఇచ్చే సౌభాగ్య లక్ష్మి, 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, రూ 400 గ్యాస్ సిలిండర్ వంటి మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండి ప్రజలు అందరిని అభిమానాలు పొందుతున్నాయన్నారు. దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడాన్నిఅయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, హత్య రాజకీయాలు చేసి గెలవాలనుకోవడం చేతగానితనానికి నిదర్శనమని ఆయన అన్నారు. హత్య రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ యార్డ్ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కశాని శ్రీనివాసరావు, సర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.