మల్లు భట్టి విక్రమార్కను సత్కరించిన మురళి నాయక్
మల్లు భట్టి విక్రమార్కను సత్కరించిన మురళి నాయక్
మహబూబాబాద్ , శోధన న్యూస్ : ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ ఫలితాలు ఉవ్వెత్తున తీసుకపోవడానికి కారణమైన మల్లు భట్టి విక్రమార్కుని హైదరాబాద్ లో మంత్రుల ఛాంబర్ లో స్వయంగా మానుకోట నియోజకవర్గం నూతన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ దంపతులు ఘనంగా సత్కరించి, మాట్లాడుతూ తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసి నేడు మంత్రి పదవి అందుకున్న వేళ ఆయనను సత్కరించడం సంతోషకరమని,ఇలాంటి పదవులు భవిష్యత్తులో మరెన్నో అధిరోహించాలని శుభాకాంక్షలు తెలిపినట్లు మానుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు.