మల్లెల మడుగులోని రైస్ మిల్ తో ఇబ్బందులు
మల్లెల మడుగులోని రైస్ మిల్ తో ఇబ్బందులు
అశ్వాపురం,శోధన న్యూస్: మండలంలోని మల్లెల మడుగు గ్రామంలో గతంలో ఒక రైస్ మిల్ వలన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లలలో మిల్ రన్నిoగ్ అయేటప్పుడు మనిషి కంటికి కనపడని సన్నటి ఊకపొట్టు రూపములో అక్కడ చుట్టుపక్కల సుమారు ఒక 200 మీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న కుటుంబాలలో అనేక మందికి ఎలర్జీలతో కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్యపరంగా ఇబ్బంది పడుతూ అనేక సార్లు సంబంధిత అధికారులకు చుట్టు పక్కల ఉన్న దళిత, బీసీ కుటుంబాల ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగినది. అది కాక ప్రస్తుతం నూతనంగా మరొక రైస్ మిల్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా మినిమం డిస్టెన్స్ లేకుండా నిబoదనలకు విరుద్ధంగా ఎలా నిర్మాణం జరుగుతున్నది? అంతేగాక అయొక్క రైస్ మిల్ కు లోకల్ పర్మిషన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, లేక వారి పై అధికారులు, లేక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలా పర్మిషన్ ఇచ్చారో రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుసుకొని ఇట్టి విషయమై అతి త్వరలో సంబంధిత పై అధికారులకు గ్రామ పంచాయతీ ప్రజలు కలవబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.