మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ -జిల్లా కలెక్టర్ ప్రియాంక
మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
-భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: స్వాతంత్య్ర నంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసిన మహానీయుడు సర్దార్ వల్లబాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సర్దార్ వల్ల బాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ఏక్తా దివాస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్, జునాగడ్ లాంటి సంస్థానాలు భారతదేశంలోని విలీనం చేసిన ఘనత అతనికే దక్కుతుందన్నారు. ఇంగ్లాండ్ లో భారిష్టర్ పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయ ఉద్యమానికి ఆకర్షితులై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారన్నారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాక చక్యంతో అణిచివేశారని ఆమె తెలిపారు. పటేల్ జాతీయ సమైక్యతకు ప్రతికనీ, భారత ప్రథమ హోంశాఖ మంత్రిగా దేశ ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారని అతని సేవలను కొనియాడారు. స్వదేశీ సంస్థలను విలీనం చేసి దేశ ఐక్యతకు పాటుపడ్డారన్నారు. అనంతరం అధికారులతో ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూధన్ రాజు, డిపిఓ రామకాంత్, డి ఎం సివిల్ సప్లై త్రినాథ్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, డి ఎస్ ఓ రుక్మిణి దేవి తదితరులు పాల్గొన్నారు.