మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి -మణుగూరు ఏరియా ఎస్ఓటు జీఎం కృష్ణయ్య
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
-మణుగూరు ఏరియా ఎస్ఓటు జీఎం కృష్ణయ్య
మణుగూరు, శోధన న్యూస్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఎస్ఓటు జీఎం వీసం కృష్ణయ్య అన్నారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సింగరేణి ఆధ్వర్యంలో సివికాలనీ సిఇఆర్ క్లబ్లో మహిళలకు, సేవ సభ్యులకు క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ క్రీడాపోటీలను ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఓటు జీఎం వీసం కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో అంతర్గతంగా ఎంతో శక్తి దాగి ఉంటుందన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీసేందుకు, వారు స్వయం ఉపాధి పొందేందుకు సింగరేణి యాజమాన్యం వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా| వారిని ప్రోత్సహించేందుకు పలు రకాల క్రీడాపోటీలను నిర్వహిస్తుందన్నారు. అందివచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మహిళలు, యువతులు టగ్ ఆఫ్ వార్, బాల్ , బాంబ్ ఇన్ ద సిటి పోటీలు, బాలబాలికలకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారిక ఎస్ఓటు జీఎం కృష్ణయ్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిఓలు సింగు శ్రీనివాస్, రామేశ్వరరావు, డి నరేష్, సేవ కార్యదర్శి షకీర, స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్వెస్లీ, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ ఆర్ శ్రీనివాస్, రామ్ లాల్, వి దీపక్ తదితరులు పాల్గొన్నారు.