తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మహిళలు మహాలక్ష్మి పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలి  -పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు 

మహిళలు మహాలక్ష్మి పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

-పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, శోధన న్యూస్ :  రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం నూతనంగా శ్రీకారం చుట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు   సద్వినియోగం చేసుకోవాలని  పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.   శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు జెండా ఊపి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని  తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో ఎక్కడనుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఇంకా  ఐదు  రోజులు పాటు ఎటువంటి గుర్తింపు లేకపోయినా ఆ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ఆ తర్వాత ప్రయాణం చేసే మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలన్నారు.  అనంతరం ఆయన  మహిళా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా విభాగం నాయకులతో కలిసి ఆర్టీసీలో  ప్రయాణం చేశారు. మహిళల గురించి అలోచించి ఉచిత ప్రయాణం కార్యక్రమం ని తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

-ఆరోగ్యశ్రీ పధకం ప్రారంభం:

మణుగూరు మండలంలోని ప్రభుత్వ  ఏరియా ఆస్పత్రిలో ఆరు  గ్యారంటీ పథకాల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ  పథకాన్ని ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాళ్ళకి ఉపయోగపడే పథకం అని ఆయన అన్నారు. అనంతరం హాస్పిటల్ సూపర్డెంట్  వారి హాస్పిటల్ బృందం  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారు,కాంగ్రెస్ పార్టీ పీసీసీ మెంబెర్ చందా సంతోష్, పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ కాటిబోయినా నాగేశ్వరరావు, మణుగూరు మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత,మణుగూరు వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సర్పంచులు, ఉపసర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *