మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూత సీఎం కేసీఆర్
మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూత సీఎం కేసీఆర్
-సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను ఆవిష్కరించిన రేగా కాంతారావు ఎమ్మెల్యే రేగా
మణుగూరు, శోధన న్యూస్: మణుగూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విజయదశమి పండగ సందర్భంగా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టోను స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఎన్నికల మ్యానిఫెస్టో దేశంలో ఎక్కడలేని విధంగా రూపొందించారని అన్నారు, దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతి తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నారు. గత ఎన్నికలలో మ్యానిఫెస్టో లో లేని విధంగా పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు ముఖ్యంగా కులవృత్తులను ఆర్థికంగా సహాయం అందజేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతు బంధు ఎకరానికి మొదటి ఏడాది 12 వేల నుంచి ఐదు సంవత్సరాల కాలంలో 16 వేలకు పెంచి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. రైతు బీమా పథకం ద్వారా లక్ష మందికి పైగా రైతులు లబ్ధి పొందాలని 73 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు పలు పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు.సౌభాగ్య లక్ష్మి పథకంతో పేద మహిళలకు 3000 గౌరవ భృతి ఇచ్చేందుకు మ్యానిఫెస్టో లో పేర్కొన్నారని దేశంలో ఎక్కడలేని విధంగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు. స్వయం శక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
-పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా అత్యుధునిక వైద్యశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి సౌకర్యాలు కల్పించారని ఇప్పటివరకు పది లక్షల ఉన్న ఆరోగ్య బీమా గరిష్ట పరిమితిని కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకంతో 15 లక్షలకు పెంచి మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నార అన్నారు.ఆసరా పెన్షన్ తో అర్హులైన వారికి చేతన అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. 3000 ఉన్న పెన్షన్ ప్రతి సంవత్సరం పెంచుతూ 5000 ఇచ్చినందుకు చర్యలు తీసుకున్నారన్నారు. దివ్యంగులకు పెన్షన్ ఇటీవల నాలుగు వేలకు పెంచారని అని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ పై ఉన్న బియ్యం అందించినందుకు అన్నపూర్ణ పథకం మ్యానిఫెస్టో తో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని దీంతో 93 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు. అదేవిధంగా 400కే వంట గ్యాస్ అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు అని తెలిపారు అదే విధంగా అగ్రవర్ణ పేదలకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.