మాజీ ఎంపీ పొంగులేటి సమక్షంలో పోట్ల పల్లి సర్పంచ్ చేరిక
మాజీ ఎంపీ పొంగులేటి సమక్షంలో పోట్ల పల్లి సర్పంచ్ చేరిక
ఖమ్మం/పినపాకI, శోధన న్యూస్: పినపాక మండలంలోని పొట్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ తోలెం కళ్యాణితో పాటు పలువురు వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటి కో చైర్మన్, ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ప్రాణత్యాగం చేసిన యువకులను చూసి చలించి పోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్ కుటుంబ పాలన సాగిస్తూ.. మాయమాటలతో ప్రజల ను మోసం చేస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్సే అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని అన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బిఅర్ఎస్ పార్టీ పతనం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమం లో పినపాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.