మాజీ మంత్రి సంభాని ని కలిసిన ఎమ్మెల్యే సండ్ర
మాజీ మంత్రి సంభాని ని కలిసిన ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి , శోధన న్యూస్ : మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మంలో సంభాని చంద్రశేఖర రావు ను ఆదివారం కలుసుకొని శాలువతో ఘనంగా సన్మానించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా సంభాని మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున పోటీ చేసిన సండ్ర విజయం కోసం పని చేశానని, నేటి వరకు మా మధ్య రాజకీయపరమైన పోరాటం మాత్రమే ఉందని వ్యక్తిగత విభేదాలు లేవని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాటచెప్పానో నేడు కూడా అదే మాట చెబుతున్నానని సండ్ర వెంకట వీరయ్య వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి,మిత్రుడని మరొకసారి గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.