మాయమాటలతో మభ్యపెట్టే మోసకారులకు బుద్దిచెప్పాలి -సిపిఎం జాతీయ నాయకురాలు పుణ్యవతి
మాయమాటలతో మభ్యపెట్టే మోసకారులకు బుద్దిచెప్పాలి
-సిపిఎం జాతీయ నాయకురాలు పుణ్యవతి
ఏన్కూరు, శోధన న్యూస్ : ఈనెల 30వ తేదీన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికలు జరుగు తున్నా యని, మాయమాటలతో మభ్యపెట్టే మోసకారులకు ఈఎన్నికల్లో బుద్దిచెప్పాలని, అవకాశవాదులకు,ఫిరాయింపుదారులకుఓటు అడిగే హక్కు లే దని సిపిఎం జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యవతి అన్నారు.వైరా నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ మండల పరిధిలోని జన్నా రం గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ.. ప్రజల కో సం నిర్బంధాలు ఎదుర్కొని జైలు శిక్షణ అనుభవించిన..భూక్య వీరభద్రం సుత్తి కొ డవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.అభి వృద్ధి చేశామని గొప్పలు చెపుతున్న కేసీఆర్ గ్రామాల్లో పర్యటించాలని ఏగ్రామంలో కూడా డబల్ బెడ్రూం ఇల్లుగాని..రేషన్ కార్డులు గాని..దళిత బంధువుగాని..బీసీ బం దుగాని అర్హులకు అందలేదని కేవలం జెండాలు మోసిన బిఆర్ఎస్ పార్టీ వారికే మా త్రమే ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఈ మోసకారులను నమ్మొద్దని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పో రాటం నిర్వహిస్తున్న సిపిఎం అభ్యర్థి భూఖ్య వీరభద్రం ను వైరా నియోజకవర్గంలో అత్యధిక ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్వాతం త్రం అనంతరం దేశాన్ని,రాష్ట్రాన్ని,పాలించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో 10 సం వత్సరాలు అధికారంలో లేక సీట్ల కోసం ఆరాటపడుతున్నారని అవకాశవాదులను పిరాయింపుదారులను ప్రోత్సహించి డబ్బు,మద్యం, ద్వారా గెలవాలని చూస్తున్నా రని వారికి బుద్ధి చెప్పాలని పుణ్యవతి పిలుపునిచ్చారు. ఉపాధి బిల్లులు రావాల న్నా,రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలన్నా,పోడుసాగుదారులకు పట్టాల అం దాలన్నా,అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు రావాలన్నా,ఎర్రజెండా బిడ్డ ముద్దు బిడ్డ వీరభద్రం ను వైరా నియోజకవర్గంలోని ప్రజలు అంతా గెలిపించాలని పిలుపు నిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు,పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు బొంతు రాంబాబు గారు మాట్లాడుతూ రైతు సమస్యలు పరిష్కారం కావా లంటే కార్మికులకు ఉపాధి పనులు దక్కాలంటే అరుహులైన పేదలందరికీ,సంక్షేమ ప థకాలు అందాలంటే,వైరా నియోజకవర్గంలో భూక్య వీరభద్రం గారిని గెలిపించాలని సుత్తి కూడా నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని వారు పిలుపునిచ్చారు.అనంతరం బీ సీ కాలనీ, ఏనుకూరు,ఇందిరానగర్ కాలనీ,అంబేద్కర్ కాలనీ,తూతక్క లింగన్నపేట, కేసు పల్లి గ్రామాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మె రుగు సత్యనారాయణ, మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, నాయకు లు బాలాజీ, వేల్పుల రాములు,ఇటికాల లెనిన్గు,గుడ్ల వెంకటేశ్వరరావు,స్వర్ణ కృష్ణా రావు, అడప రామారావు,,ఐద్వా రాష్ట్ర నాయకురాలు మెరుగు రమణ తదితరు లు పాల్గొన్నారు.