మిర్చి పంటను పరిశీలించిన వ్యవసాయశాఖ ఏఓ
మిర్చి పంటను పరిశీలించిన వ్యవసాయశాఖ ఏఓ
కారేపల్లి, శోధన న్యూస్ : మిర్చి పంటలలో సోకిన తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపడితేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని మండల వ్యవసాయ శాఖ అధికారి కే ఉమామహేశ్వర రెడ్డి అన్నారు.మంగళవారం మండల పరిధిలోని పోలంపల్లి గ్రామ పరిధిలో సాగు చేస్తున్న మిరప పంటలను మండల వ్యవసాయశాఖ అధికారి కే మామహేశ్వరరెడ్డి పరిశీలించారు.ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావం వలన నేలకు ఒరిగిన మొక్కలలో సస్యరక్షణ చేపట్టవలసినదిగా ఆయన రైతులకు సూచించడం జరిగింది.దీనిలో భాగంగా కిందపడిపోయిన మొక్కలను,నిలబెట్టి ఉతం ఇవ్వాలని,వర్షం వచ్చి పోయినందున ప్రస్తుత పరిస్థితులలో కాయకుల్లుడు,కొమ్మకు ల్లుడు ఎక్కువగా ఆశించడం జరిగిందని దీని నివారణకు అజాక్స్ స్ట్రాబిన్ తో కలిపి టెబుకోనజోల్ 250 ఎమ్మె ఎల్ లేదా పీకాక్సి స్ట్రాబిన్ తో కలిపి ట్రై సైకలాజోల్ 400 ఎమ్మెల్ లేదా అజాక్స్ స్ట్రాబిన్ తో కలిపి డైఫైన కొనజోల్ 250ఎం ఎల్ మందులలో ఏదో ఒకదానిని వారం వ్యవధిలో రెండుసార్లు మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలన్నారు. అదేవిధంగా పైముడత మరియు నల్లతామర పురుగు ఉధృతి గమనించడం కూడా జరిగినదని దీని నివారణకు గాను బ్లూక్సిమేటామైడ్ 160ఎం ఎల్ లేదా బ్రో ప్లానలైట్ 50 ఎం ఎల్ లేదా ఫిబ్రోనిల్40 గ్రాములు మందులను పై ముడత నల్లతామరు పురుగు ఉధృతికి వారంలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉసిరికాయలపల్లి ఏఈ ఓ ప్రమీల పోలంపల్లి గ్రామ రైతులు ఉన్నారు.