మీ కష్టాల్లో తోడుంటా… మరోసారి అవకాశం ఇవ్వండి..-ప్రభుత్వ విప్ రేగా
మీ కష్టాల్లో తోడుంటా… మరోసారి అవకాశం ఇవ్వండి…
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
కరకగూడెం, శోధన న్యూస్ : పినపాక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని, మీ కష్టాల్లో తోడుంటానని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండలం చిరుమల్ల గ్రామపంచాయతీలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పార్టీ నాయకులతో కలిసి ఇంటింట ప్రచారం చేస్తూ..కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆపద వస్తే ఆదుకుంటా మరోసారి ఎమ్మెల్యే గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో కెసిఆర్ బీమా పథకం ప్రతి ఇంటికి ధీమాగా మారబోతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి తెలిపాలన్నారు. మహిళలకు నెలనెల రూ. 3 వేలు ఇవ్వడంతో పాటు అన్నపూర్ణ పథకం కిందట రేషన్ షాపు ద్వారా సన్నబియ్యం మహిళా సంఘాలకు మరింత బలోపేతం చేయడం సౌభాగ్య లక్ష్మీ పథకం మహిళలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆసరా పింఛన్లు రానున్న ఐదేళ్లలో రూ.5 వేలు, దివ్యాంగుల పెన్షన్లు రూ 6వేలకు పెంపు, వ్యవసాయానికి రైతు బంధు రూ.16 వేలు పెంపు, మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ.400కు, ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలు పెంపు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రాష్ట్రంలో 119 రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి పథకాలు అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సాధించిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అని ఆయన అన్నారు ప్రభుత్వ పథకాలు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ప్రజల మోసం చేస్తున్నాయని అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.