తెలంగాణహైదరాబాద్

 ముఖ్యమంత్రి కేసీఆర్  తో భేటీ అయిన ఎంపీ వద్దిరాజు  మాజీ మంత్రి సంభాని 

 ముఖ్యమంత్రి కేసీఆర్  తో భేటీ అయిన ఎంపీ వద్దిరాజు  మాజీ మంత్రి సంభాని 

హైద్రాబాద్, శోధన న్యూస్ : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎడవల్లి కృష్ణ, మానవతారాయ్, రాంచందర్ నాయక్ తదితరులు బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్   వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా రవిచంద్ర, చంద్రశేఖర్,అబ్బయ్య, కృష్ణ, మానవతారాయ్, రాంచందర్ నాయక్ తదితర ప్రముఖులు కేసీఆర్తో కలిసి భోజనం చేశారు. కేసీఆర్ వారితో సుమారు రెండున్నర గంటలు ఇష్టాగోష్టి జరిపారు. తెలంగాణ మహోద్యమం,రాష్ట్ర ఏర్పాటుకు ముందు,ఆ తర్వాత పరిస్థితుల గురించి కళ్లకుగట్టినట్టు వివరించారు.  కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి,సముద్ధరణకు తనతో పాటు ముందుకు నడవాల్సిందిగా కేసీఆర్ వారిని కోరారు.  ఎన్నికల సమయంలో తీరిక చేసుకుని తమతో విలువైన కాలాన్ని వెచ్చించినందుకు వారు ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలిపారు.

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *