తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ-జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక 

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

-జిల్లా వ్యాప్తంగా 136  నామినేషన్లు దాఖలు 

-ఎన్నికలు నిర్వహణకు సహకరించాలి 

-జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి  నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందని,  జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు ఈ నెల 3వ తేదీ నుండి 10 వ తేదీ వరకు 136 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఈ నెల మూడో తేదీ 10వ తేదీ వరకు (5వ తేదీ ఆదివారం ప్రభుత్వ) జిల్లాలోని ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరణ జరిగినట్లు ఆమె తెలిపారు.  పినపాకలో 25 మంది, ఇల్లందు లో 34 మంది, కొత్తగూడెం లో 36 మంది, అశ్వారావుపేట లో 23 మంది, భద్రాచలం లో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు తెలిపారు.  మొత్తం ఐదు నియోజకవర్గాలకు 136 మంది అభ్యర్థులు 211 సెట్లు నామినేషన్స్ వేసినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్లు పరిశీలన (స్క్రూట్ని ), 15వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ  ఉంటుందని,  అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుందన్నారు.  పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఆమె సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ముగిసినందున ప్రచార కార్యక్రమాలపై పటిష్ట నిఘా కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. ప్రధానంగా జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో నిరంతర పటిష్ట నిఘా ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడైనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంగం నిబంధనలు మేరకు తగు చర్యలు చేపట్టాలని ఆయా నోడల్ అధికారులను ఆదేశించారు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసే అవకాశముందన్నారు. పటిష్ట ఎన్నికల నియమావళి అమల్లో బాగంగా టీములు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంతంగా నిర్వహించుటకు ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు.  ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ప్రజలు సి విజిల్ యాప్ కు కానీ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటలు పని చేయు 1950 కంట్రోల్ రూముకు పిర్యాదు చేయాలని సూచించారు.  పిర్యాదు స్వభావాన్ని ఆయా వ్యక్తులకు సెల్ ఫోన్స్ కు సమాచారం అందించడం జరుగుతుందిన్నారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అక్రమాలకు పాల్పపడైనాడనా తక్షణమే యాప్ కానీ కంట్రోల్ రూముకు కానీ సమాచారం అందించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. మన లక్ష్యం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నారు. ఎన్నికలు నిర్వహణకు ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆమె సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *