తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయంకు  సన్మానం

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయంకు  సన్మానం

మణుగూరు, శోధన న్యూస్ : మణుగూరు మండల వేణు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లుని ఘనంగా సన్మా నించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ … శాసనసభ ఎన్నికల్లో మున్నూరు కాపు సంఘం ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం ఇచ్చిన మాట ప్రకారం ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన మున్నూరు కాపు సంఘానికి అన్నివేళలా అండగా ఉంటానని అన్నారు.   మున్నూరు కాపుల చిరకాల ఆకాంక్ష కల్యాణ మండపాన్ని పూర్తిచేసి అప్పగించే బాధ్యత నాది అని అన్నారు.  స్థానిక కంపెనీలలో ఉద్యోగాలలో మున్నూరు కాపు యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని, స్థానిక సంస్థ ల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వారికి సరైన గుర్తింపును ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేనిఫెస్టోలో మున్నూరు కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన విధంగా కచ్చితంగా ఏర్పాటు చేస్తుందని పూర్తి భరోసాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల అధ్యక్షుడు కార్యదర్శులు కృష్ణ మోహన్, గాండ్ల సురేష్ , పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ వలసాల వెంకట రామారావు, గోపిశెట్టి శివయ్య,డాక్టర్ గాజుల కోటేశ్వరరావు, ఆవుల కనకయ్య, మర్రి సారంగపాణి, గాండ్ల మల్లయ్య, బత్తుల శ్రీనివాస్, పులి శెట్టి బాబు, వనం సత్యనారాయణ, పొట్ల ముత్తయ్య, బేతంచెర్ల వెంకటేశ్వర్లు, గాజుల రమేష్, గాజుల పూర్ణచందర్రావు, మేడ నాగేశ్వరరావు, అశ్వాపురం మండలం నాయకులు ఉసా. అనిల్, కమటం సురేష్, కమటం నరేష్, సుంకరి సురేందర్, ప ర్వాతనేని నరేష్, బూరంపాడు మండల నాయకులు వారాల వేణు, బెల్లంకొండ రామారావు, పినపాక మండల నాయకులు బొడ్డు ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *