తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మున్సిపల్ శాఖలు అప్రమత్తంగా ఉండాలి -మున్సిపల్ చైర్మన్ దమ్మాల పాటి వెంకటేశ్వరావు

మున్సిపల్ శాఖలు అప్రమత్తంగా ఉండాలి

-మున్సిపల్ చైర్మన్ దమ్మాల పాటి వెంకటేశ్వరావు

ఇల్లందు, శోధన న్యూస్ : మున్సిపల్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాల పాటి వెంకటేశ్వరావు తెలిపారు. ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సిబ్బందితో నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ దమ్మాల పాటి వెంకటేశ్వరావు బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు .పారిశుద్ధం, రెవెన్యూ,  ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహించాలనీ కోరారు. సెక్షన్ల వారిగా రివ్యూ మీటింగ్ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. పట్టణంలో పారిశుద్ధ వ్యవస్థను పకడ్బందీగా నడిపించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు చెత్త వాహనాలు ప్రతి ఇంటికి వెళ్లాల్సిందేనని అన్నారు. ప్రతి డ్రైనేజీ శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ప్రధాన రహదారి మీద వర్షపు నీరు రాకుండా షాపుల ఎదుట పోసిన మట్టిని తొలగించాలన్నారు. రెవెన్యూ పెంచేందుకు అధికారులు కార్యచరణ రూపొందించుకోవాలని రెవెన్యూ  అధికారులకు తెలిపారు. నూతనంగా ప్రారంభించుకున్న షాపింగ్ కాంప్లెక్స్ లు, మోడల్ మార్కెట్ షాపులను టెండర్ విధానంలో పిలిచి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంటి టాక్స్ మరియు పంపు టాక్స్ పట్టణ ప్రజలు సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  పట్టణంలో ఎక్కడ ఇంక్రోజ్మెంట్ జరిగిన వెంటనే వారి పైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని , పర్మిషన్ లేని కట్టడాలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులను ఆదేశించారు. ఇల్లందు పట్టణ రహదారి ఇరువైపులా ఏక్కడ ఎంక్రోజ్మెంట్ జరిగినా వెంటనే తొలగించాలన్నారు. నిర్మాణంలో ఉన్న కట్టడాలను వెంటనే పూర్తి చేసే విధంగా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అసంతృప్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో బ్లీచింగ్ పౌడర్ ప్రతివార్డుకి పంపించాలన్నారు. నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, డి ఈ నవీన్ మేనేజర్ అంకు షావలి, మున్సిపల్ కౌన్సిలర్లు వారా రవి, అంకెపాక నవీన్ కుమార్ ,కుమ్మరి రవీందర్, ఏ ఓ శ్రీనివాస్ రెడ్డి,అర్ ఐ శ్రీనివాస్, ఏఈ శంకర్ , సానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ జూనియర్ అసిస్టెంట్లు జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *