ములుగులో జోరుగా హస్తం ప్రచారం
జోరుగా హస్తం ప్రచారం
-ప్రచారాన్ని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క
ములుగు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రం లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి సీతక్క గెలుపు కోసం నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ,ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. మంగపేట మండల తొండ్యాల, కోమటిపల్లి గ్రామం లో ప్రచారానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క కు మంగళ హారతులతో స్వాగతం పలికి ప్రచారంలో భాగస్వాములయ్యారు. తొండ్యాల, కోమటిపల్లి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే సీతక్క పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఉద్యమ నాయకులు మేడిద సతీష్తో పాటు 60 మందికి ఆమె కండువా కప్పి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, సీతక్క అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.