ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి- విప్ రేగా
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
-బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ను ఆవిష్కరించిన విప్ రేగా
మణుగూరు, శోధన న్యూస్ : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రే గా కాంతారావు బుధవారం సామాన్యుడి కోసం కేసీఆర్ సంకల్పం బిఆర్ఎస్ మ్యానిఫెస్టో బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తున్నదని అన్నారు, బిఆర్ఎస్ పాలనలో ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన అన్నారు. పేద ముస్లింలకు కార్పొరేట్ విద్యలు అందించినందుకు రాష్ట్రంలో వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు అన్ని మతాలకు ప్రాధాన్యతను ఇచ్చి సీఎం కేసీఆర్ ముందుకు సాగుతుందఅన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీ ఆడబిడ్డల పెండ్లిలకు షాదీ ముబారక్ పథకం కింద లక్ష 116 లు ప్రభుత్వం అందిస్తున్నది అన్నారు.