మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం
మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం
అశ్వరావుపేట, శోధన న్యూస్: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అశ్వరావుపేట టిఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్న స్థానిక శాసనసభ్యులు మచ్చ నాగేశ్వరావు గెలుపుకై పార్టీ నేతలు నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేటలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దండబత్తుల బజార్, గాంధీబొమ్మ సెంటర్,సాయి సుమన్ బజార్, పొట్టి.శ్రీరాముల బజార్, కట్ట.రామదాసు బజార్ లలో డోర్ టూ డోర్ తిరుగుతూ అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరించారు. అనంతరం కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అడుగుతు మేనిఫెస్టో ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి బిఅర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కారు గుర్తుపై ఓటు వేయాలని ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి ఓటర్లను అభ్యర్థించారు.అలాగే ఈవీఎం తో నాలుగో నంబర్ మీద ఓటు వేయాలని ప్రజలకు మండల నాయకులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోజిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ రావు,అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు.సంపూర్ణ మండల నాయకులు,సంక.ప్రసాద్,తాడేపల్లి. రవి,సీమకుర్తి.వెంకటేశ్వర రావు, సొమనీ.రమేష్,బాలి.కిరణ్,చరణ్,త్రినాథ్,బుజ్జిబాబు,వెంకన్న బాబు,తాళం సూరి, లింగిసెట్టి.వెంకటేశ్వర రావు,మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.