మెచ్చ విజయాన్ని కాంక్షిస్తూ తాటి ప్రచారం
మెచ్చ విజయాన్ని కాంక్షిస్తూ తాటి ప్రచారం
దమ్మపేట, శోధన న్యూస్ : ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అశ్వరావుపేట కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెచ్చ నాగేశ్వరరావు విజయని కాంక్షిస్తూ మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు ఆదివారం మండలంలోని మండల మందలపల్లి లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో మచ్చా వెంట రోడ్ షోలలో పాల్గొన్న తాటి మందలపల్లి లో స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయని ఈ సంక్షేమ పథకాలు మరల కొనసాగించాలంటే ప్రజలు తప్పనిసరిగా కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.మందలపల్లి లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రచార కార్యక్రమంలో జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు , ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి ,వైస్ ఎంపిపి దారా మల్లిఖార్జునరావు , మందలపల్లి ఉపసర్పంచ్ , దిశ కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ , ఎంపిటిసి దేవరపల్లి అజయ్ , దొడ్డాకుల రాజేశ్వరరావు , దొడ్డా రమేష్ బుడే ,యార్లగడ్డ బాబు , పానుగంటి చిట్టిబాబు , రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.