మెట్రో షూస్ ఆధ్వర్యంలో టేక్స్ యు టు ది న్యూ ప్రచారం
మెట్రో షూస్ ఆధ్వర్యంలో టేక్స్ యు టు ది న్యూ ప్రచారం
హైదరాబాద్, శోధన న్యూస్: ప్రముఖ పాదరక్షల బ్రాండ్ తమ నూతన టేక్స్ యు టు ది న్యూ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ విషయమై మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపికా దీప్తి మాట్లాడుతూ వినియోగదారులతో తమ సంస్థకు ఉన్న అనుబంధాన్ని నూతన ప్రచారం వ్యక్తం చేస్తుందన్నారు.తమ బ్రాండ్ కి సుస్థిర స్థానం కల్పిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడంలో తాము ముందుంటామని చెప్పుకొచ్చారు. సంప్రదాయాన్ని, కొత్త మోడల్స్ ని స్వీకరించే వారికి తమ బ్రాండ్ అంకితం అన్నారు. పురుషుల కోసం స్నూకర్, సువేవ్ బ్రోగ్, లోఫర్, కొల్హాపూరీ, మహిళలకు పాస్టెల్ హుడ్, స్లీప్ ఆన్, గ్లామ్ బ్లాక్ హిల్స్ వంటి ఎన్నో మోడల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వినియోగదారులకు తమ ప్రచారం నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.