మెడికల్ షాప్ లను తనిఖీ చేసిన పిహెచ్ సి వైద్యులు
మెడికల్ షాప్ లను తనిఖీ చేసిన పిహెచ్ సి వైద్యులు
జూలూరుపాడు, శోధన న్యూస్ : మండల కేంద్రంలోని మెడికల్ షాప్ లను ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రాకేష్ కుమార్ తనిఖీ చేశారు. శుక్రవారం తన సిబ్బంది తో కలసి పలు ఔషధ దుకాణాల్లోని ఔషధ నిల్వలను పరిశీలించారు.దుకాణంలోని గడువు ముగిసిన మందులు ఉండకూడదని యజమానులకు సూచించారు.ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించవద్దని రాకేష్ కుమార్ చెప్పారు.దుకాణం లైసెన్స్ ను నిర్ణిత గడువులోగా రెన్యూవల్ చేసుకోవాలన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ షాప్ యజమానులు వ్యవహరించాలని డాక్టర్ రాకేష్ కుమార్ కోరారు. ఈ తనిఖీల్లో హెల్త్ సూపర్వైజర్ రత్నకుమార్ పాల్గొన్నారు.