మేము సైతం ట్రస్ట్ అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మేము సైతం మిత్రమండలి ట్రస్ట్ అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మణుగూరు, శోధన న్యూస్: మండలంలోని సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపాన గలా మేము సైతం మిత్రమండలి చారిటుబల్ ట్రస్ట్ అధ్వర్యంలో సోమవారం ఘనంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ బతుకమ్మ సంబరాల్లో మహిళలు రకరకాల పూలను తీసుకు వచ్చి బతుకమ్మను పేర్చారు.పేర్చిన బతుకమ్మలను గద్దెకు చేర్చి బతుకమ్మ ల పాటలకు నృత్యాలు చేశారు.అనంతరం సుందరంగా బతుకమ్మలను పేర్చిన మహిళలకు మొదటి, రెండవ బహుమతులను మేము సైతం మిత్రమండలి ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమం లో మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి మార్తి శ్రీనివాసరావు, కోశాధికారి రంగా శ్రీనివాసరావు, కార్యక్రమాల నిర్వహణ ఇంచార్జ్ చిందుకూరి ఏడుకోండలు,సభ్యులు రాబిన్ కుమార్, మల్లిఖార్జున్,మేకల గోపి,ప్రదీప్,టైలరింగ్ ట్రైనర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు