తెలంగాణహైదరాబాద్

యువతకు వెలుగు బిఆర్ఎస్ -ఎంపి రంజిత్ రెడ్డి

యువతకు వెలుగు బిఆర్ఎస్

  • ఎంపి రంజిత్ రెడ్డి

హైదరాబాద్, శోధన న్యూస్: చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన యువ సమ్మేళన కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పాల్గొన్నారు. చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి దామర గిద్ద అలూరు న్యలట బస్తేపుర్ కుమ్మరా, కమ్మెట, పామెన, ఊరెళ్ళ ,ఖానాపూర్, నారాయణ దాస్ గూడ గ్రామాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలో 500 మంది చేరారు. ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య వారికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సమ్మేళనంలో ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులు అయి ఇతర పార్టీల నుంచి బిఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి గౌరవప్రదమైన సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరు పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. గెలుపే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో యువత యాదయ్యతో కలిసి నడవాలి పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత యువతదే ప్రధానని వెల్లడించారు.
ప్రభుత్వ విజయాలతో పాటు ప్రతిపక్ష వైఫల్యాలను ప్రజలకు చెప్పవలసి యువత బాధ్యత అన్నారు. ప్రజల్లో బిఆర్ఎస్ బలమెంటో ప్రతిపక్షాలకు యువతకు చూపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే  కాలె యాదయ్య  మాట్లాడుతూ..కెసిఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత యువతదన్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా యువజన విభాగాలు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రత్యర్థులు చేసే అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మళ్ళీ రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పార్టీ మ్యానిఫెస్టోపై బూతు స్థాయిలో చర్చ జరిగేలా సోషల్ మీడియా వేదికగా ప్రతి మండలంలో యువత పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలుపులో యువతదే కీలక పత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి, జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మొయినాబాద్ జడ్పిటిసి కాలే శ్రీకాంత్, మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్ణ శివప్రసాద్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు షేరి శివారెడ్డి, గుడిపల్లి రవికాంత్ రెడ్డి, పామేన సర్పంచ్ మల్లారెడ్డి, కమ్మటి సర్పంచ్ భాను, బిఆర్ఎస్ నాయకులు దర్శన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫయాజుద్దీన్, సత్తయ్య, జంగారెడ్డి, నాగార్జున రెడ్డి, పెంటారెడ్డి, సత్యనారాయణ చారి, భీమ్ రెడ్డి, బాసిద్, దండు సత్తి, రాఘవేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *