యువత కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
యువత కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
-డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
కామేపల్లి, శోధన న్యూస్ : కామేపల్లి మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైన బానోత్ దేవ్ సింగ్ మర్యాదపూర్వకంగా మల్లి బాబు యాదవ్ ని కలిశారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని అప్పుడే ప్రజాస్వామ్యం విలువ పెరుగుతుందని అన్నారు.విద్యాధికుడైన దేవి సింగకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి రావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా దేవి సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనని పదవికి ఎందుకు చేసినందుకు జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ బాబుకు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి . టీపీసీసీ రాష్ట్ర నాయకులు శ్రీ రాoరెడ్డి గోపాల్ రెడ్డికి. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య కి. టీపీసీసీ ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. జిల్లా యువజన నాయకులు రాoరెడ్డి చరణ్ రెడ్డికి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నరసింహ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.