యువత చేతుల్లోనే భవిష్యత్ -ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
యువత చేతుల్లోనే భవిష్యత్
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
–బిఆర్ఎస్ లో 30 మంది యువకులు చేరిక
ముసలిమడుగు, శోధన న్యూస్ : దేశ, రాష్ట్ర భవిష్యత్ యువత చేతిలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ముసలిమడుగు గ్రామ పంచాయతీ నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 యువకులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ . అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. యువకులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలో అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో యువకుల పాత్ర ఎంతో క్రియాశీలకమని, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. ఈ నెల 30 తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.