యూనియన్ బ్యాంక్ సేవలపై కళాజాత ప్రదర్శన
యూనియన్ బ్యాంక్ సేవలపై కళాజాత ప్రదర్శన
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మణుగూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్యాంక్ సేవలపై, ఆర్ధిక అక్షరాస్యతపై శనివారం కళాజాత ప్రధర్శన , మ్యాజిక్ షో ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపాజిట్లు, రికవరీ, ప్రమాదబీమా పథకాలైన ప్రధానమంత్రి జనథన్ యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సహజ మరణం అటల్ పెన్షన్ యోజన, రూపేకార్డ్, విద్యా, వ్యవసాయం, వ్యాపార అభివృద్ధి రుణాలు, డ్వాక్రా రుణాలు, జీరో అకౌంట్స్ వంటి వాటిపై మహిళలకు, ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం బ్యాంక్ సేవలపై కెఎస్ రూరల్ మీడియా వారిచే మ్యాజిక్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ శివకిషోర్, ఎఫ్ఎ గౌతమ్, విఏఓ ఎస్ నఫీజ్, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.