రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యం..
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యం..
-కబ్జాల బి అర్ ఎస్ ప్రభుత్వం కావాలా…
-తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా..
-టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
జనగామ, శోధన న్యూస్ : దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించబోతున్న ఈ ఎన్నికల్లో ఎర్రకోటపై త్రివర్ణ జెండా ఎగరవేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమం కోసం కాదు తెలంగాణ రాష్ట్ర పౌరుషానికి దోపిడీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని,రాబోయే ఎన్నికల్లో 60 సంవత్సరాల ఆకాంక్ష ప్రజల భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని,కేసిఆర్ ప్రభుత్వం గత దశాబ్దంలో శతాబ్దానికి సరిపోయే లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని,ఔటర్ రింగ్ రోడ్ కబ్జాలు,కాళేశ్వర అవినీతి,మద్యం లో అవినీతి,30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఉద్యమం ముసుగులో లక్షల కోట్లు సంపాదించి ఫామ్ హౌస్ లో ఉండి, కాలేశ్వరం మీద లక్షల కోట్లు దోపిడీ చేసిన దుర్మార్గ పాలన కావాల్నా, తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ కావాల్నా ఆలోచన చేయాలన్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి స్వయంగా ముత్తిరెడ్డి పట్టణ చౌరస్తాలో అర్ద నగ్న ప్రదర్శన చేశారని,పసుపు కుంకుమ కింద చెల్లేకు ఇచ్చిన ఆస్తులు దోచిన వ్యక్తి పల్లా అని, జనగామ పొలిమెరలో కాలు పెట్టనీయద్దని స్వయంగా ముత్తిరెడ్డి చెప్పాడని, ముత్తిరెడ్డి బాగోతం పల్లాకు తెలుసని,పల్లా భాగోతం ముత్తిరెడ్డి కి తెలుసు. ఇద్దరి బాగోతం కేసీఆర్కు తెలుసని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆదేశాలతో 6 గ్యారంటీలతో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు.కేసిఆర్ బై… బై……అన్నారు.సభలో రేవంత్ మాట్లాడుతుండగా సీఎం….సీఎం ..అంటూ అభిమానులు రేవంత్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.రేవంత్ రాకతో జనగామ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నిపారనడంలో ఎలాంటి సందేహం లేదు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాయితీ గా పనిచేస్తా మీకు అండగా ఉంటా గెలిపించండి అన్నారు.రానున్న ఎన్నికల్లో బారాస ప్రభుత్వం ను భూస్థాపితం చేయాలని అన్నారు.జిల్లా సాధన లో ఉన్న ఉద్యమ నాయకుడిగా మీ ముందుకు వస్తున్న అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.