తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ను అడ్డుకోవడం అప్రజాస్వామికం   -పినపాక ఎమ్మెల్యే పాయం

 

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ను అడ్డుకోవడం అప్రజాస్వామికం 
 -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు,శోధన న్యూస్:

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ను అడ్డుకోవడం అప్రజాస్వామికం అని
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

రాహుల్ గాంధీని సోమవారం నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ మంగళవారం మణుగూరులో పట్టణంలో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ… ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పై దాడికి యత్నం దుర్మార్గపు చర్య అన్నారు.
రౌడీలతో దేవాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
ఈ చర్య పూర్తిగా శాంతి భద్రతలు కాపాడలేని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యమేనని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం దాడులకు ఉసిగొల్పి నియంతృత్వమా లేక ప్రజా స్వామ్యమా అన్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.  భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్న సందర్బంగా వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి పనులకు ఒడిగట్టారన్నారు. ఇలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులకు, కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *