రెండు లారీలు ఢీ..డ్రైవర్ కు తీవ్ర గాయాలు
రెండు లారీలు ఢీ..డ్రైవర్ కు తీవ్ర గాయాలు
కొణిజర్ల, శోధన న్యూస్ : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్ కు తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున కొణిజర్ల మండలంలోని పల్లిపాడు సమీపంలో ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.సంఘటనలోని సాక్షుల కథనం ప్రకారం వరంగల్ పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు ధాన్యం లోడుతో వెళ్తున్నటువంటి లారీని వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న డీసీఎం వ్యానుకోల్డ్ స్టోరేజ్ సమీపంలో లారీని ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది.రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలను తప్పించబోయి పరిస్థితి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదం జరిగినప్పుడు వ్యాన్లో డ్రైవర్ ఒక్కడే ఉండటంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో 108 సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వ్యాను ఎడమవైపు భాగం వ్యాను పూర్తిగా కావటంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.