రెండో వారధి నిర్మాణ పనులను తక్షమే ప్రారంభించాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
రెండో వారధి నిర్మాణ పనులను తక్షమే ప్రారంభించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం , శోధన న్యూస్: భద్రాచలం వద్ద రెండో వారధి నిర్మాణ పనులను తక్షమే ప్రారంభించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శుక్రవారం ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వంతెన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరి మాసం వరకు వారధి నిర్మాణ పనులు పూర్తి చేయు విదంగా కార్యాచరణ తయారు చేయాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన కూలీలలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెన పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని అదేశించారు. వారధి నిర్మాణ పనులకు ప్రత్యామ్నయంగా రెండు వైపుల అప్రోచ్ రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తి చేయుటకు షెడ్యూల్ తయారు చేయాలని, షెడ్యూల్ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈ ఈ యుగందర్, డి ఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.