రేగా కాంతారావుకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మద్దతు
రేగా కాంతారావుకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మద్దతు
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపధ్యంలో పినపాక బిఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు గెలుపుకు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జెఏసి చైర్మన్ నల్లా రాధాకృష్ణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశం లో నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందని తెలిపారు. బీటీపీఎస్ భూ నిర్వాసితులకు 364 మంది కి ఒకేసారి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత రేగా కాంతారావుకి దక్కిందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు. మణుగూరు పట్టణాన్ని సుందరీకరణ చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. పినపాక నియోజకవర్గ అబివృద్దికి, ప్రజల సంక్షేమానికి పాటుపడిన రేగా కాంతారావును ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పప్పుల సుధాకర్, వి. శ్రీను, బాబురావు, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.