రేగా సమక్షంలో 30 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక
రేగా సమక్షంలో 30 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక
మణుగూరు, శోధన న్యూస్: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజపేట ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సుస్థిర పాలన అందడంతో పాటు అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు గ్యారంటీ లేని ఆరు స్కీముల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. ప్రజలు వారి మాయ మాటలను, మోసపూరిత పథకాలను నమ్మొద్దని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ఆయన తెలిపారు.