రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణదే – సీఎం కేసీఆర్
దేశంలోనే రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణదే
– ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రైతుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా తమ మదిలో నుంచి రైతుబంధు పథకాన్ని రూపకల్పన చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఘనత తమదేనని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలో ఎన్నికల రెండో విడత ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అధ్యక్షత న ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై, ప్రసంగిస్తూ.. అచ్చంపేట ప్రాంతంలో సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న ఉమ్మడి మండలాలైన అమ్రాబాద్ పదర మండలానికి ఉమామహేశ్వరం లిఫ్టుల ద్వారా ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను పారిస్తూ సాగునీళ్లు అందించడమే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ 192 కేసులు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సీఎం విమర్శించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వలసలు వెళ్లేదని నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న పది సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు అందిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా రెపరెపలాడదాం ఖాయమన్నారు. అచ్చంపేట ప్రాంతానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కోరిక మేరకు పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం అవతరించాక సబ్బండా కులాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత తమదేనన్నారు. దేశంలోనే రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే అన్నారు . అదేవిధంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ అచ్చంపేట ప్రాంతంలో సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తమ అభివృతం అన్నారు . ఉమ్మడి మండలాలైన ప్రజల అమ్రాబాద్ మండలాలకు సాగునీరు అందించడమే తమ ఏకైక లక్ష్యం అన్నారు . అచ్చంపేట ప్రాంత ప్రజలు తమను మూడోసారి ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.