ర్యాగింగ్ కు పాల్పడితే కఠినచర్యలు తప్పవు -సీ ఐ కరుణాకర్
ర్యాగింగ్ కు పాల్పడితే కఠినచర్యలు తప్పవు
-సీ ఐ కరుణాకర్
ఇల్లందు , శోధన న్యూస్ : స్థానిక ప్రభుత్వ గిరిజన బాలల వసతి గృహంలో ప్రభుత్వ జూని యర్ కళాశాల, జాతీయ సేవాపథకం విభాగం ఆధ్వర్యంలో ర్యాగింగ్ పై అవగాహన సదస్సున్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తోర్తి జాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్య క్రమంలో సి ఐ టి కరుణాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యా ర్డులను పరిచయం పేరుతో వికృతచర్యలకు పాల్పడి, దూషించడం, హేళన చేయడం ఏడిపించడం భయభ్రాంతులకు గురిచేయడం లాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అన్నారు. ర్యాగింగ్ నిషేధ చట్టం -1997 ప్రకారం సెక్షన్ 4 లో పేర్కొనిన విధంగా ఆరు నెలలు జైలు శిక్షపడటంతో రూ. 1000 వరకు జరిమానా ఉంటుందన్నారు. ఎంజాయ్ ముఖ్యము కాదని మీ భవిష్యత్తు ముఖ్యమన్నారు ఫేస్ లేని ఫేస్బుక్లో మీ అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, మూఢ నమ్మకాలు విశ్వసించోద్దని క్రమశిక్షణతో ఉంటూ తల్లిదండ్రులు, సమాజానికి మంచిపేరు తేవాలని ర్యాగింగ్ కు పాల్పడవద్దన్నారు.ఈ కార్యక్రమంలో 14 నంబర్ బస్తి వార్డు మాజీ కౌన్సిలర్ సుదర్శన్ కోరి, ఎస్టి వసతి గృహం వార్డెన్ చందు, బీసీ హాస్టల్ వార్డెన్ రవి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విలియం ప్రసాద్,ఎస్ టి వసతి గృహ సహాయకులు, సుబ్రహ్మణ్యం,బిసి వసతి గృహ సహాయకులు వినోద్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.